46 గంటల్లో కోటి వ్యూస్

Wednesday,June 07,2017 - 06:02 by Z_CLU

సోషల్ మీడియాలో దువ్వాడ మేనియా కొనసాగుతోంది. డీజే సినిమా ట్రయిలర్ యూట్యూబ్, ఫేస్ బుక్ ను రఫ్ఫాడిస్తోంది. విడుదలైన క్షణం నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా ట్రయిలర్ తాజాగా కోటి మార్క్ అందుకుంది. అవును.. కేవలం 46 గంటల్లో ఈ సినిమా ట్రయిలర్ కు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బన్నీ సినిమాపై ఆడియన్స్ లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు.

హరీష్ శంకర్ డైరక్షన్ లో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది దువ్వాడ జగన్నాథమ్ సినిమా. ఈ మూవీ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ట్రయిలర్ కూడా మరిన్ని రికార్డులు సృష్టిస్తోంది. విడుదలై గంటకే లక్షల్లో వ్యూస్ సాధించిన ట్రయిలర్.. ఆ తర్వాత 4 గంటలకే 1 మిలియన్ వ్యూస్ సాధించింది. అలా గంటగంటకు కౌంట్ పెంచుకుంటూ.. ప్రస్తుతం కోటి వ్యూస్ తో చెక్కుచెదరని రికార్డు సృష్టించింది డీజే.

బన్నీ, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈనెల 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. దిల్ రాజు నిర్మించిన డీజేకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.