జీ సినిమాలు ( 8th జూన్ )

Wednesday,June 07,2017 - 10:03 by Z_CLU

పెద్ద మనుషులు 

హీరోహీరోయిన్లు  – సుమన్, రచన, హీరా

ఇతర నటీనటులు – ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, కోటశ్రీనివాసరావు,  కైకాల సత్యనారాయణ

సంగీతం – ఈశ్వర్

దర్శకత్వం – బోయిన సుబ్బారావు

నిర్మాత – డి. రామానాయుడు

విడుదల – 1999, జనవరి 13

 భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పడంతో పాటు… ఆలుమగల మధ్య మాట పట్టింపులు, అనుమానాలు వస్తే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో చాటిచెప్పిన చిత్రమే పెద్ద మనుషులు. సినిమా మొత్తం సుమన్ చుట్టూనే తిరిగినప్పటికీ… పెద్దమనుషులుగా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు తన నటనతో సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఈ సినిమాతోనే ఈశ్వర్… సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

==============================================================================

నకిలీ

నటీనటులు : విజయ్ అంటోని, సిద్ధార్థ్ వేణు గోపాల్

ఇతర నటీనటులు : రూప మంజరి, అనుయ భగవత్, విజయ్, విభ నటరాజన్, కృష్ణమూర్తి, ప్రమోద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ అంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ అంటోని

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2012

 విజయ్ అంటోని హీరోగా జీవ శంకర్ డైరేక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ నకిలీ. చిన్నప్పుడే తల్లిని చంపిన హత్యా నేరంలో జైలు కెళ్ళిన కుర్రాడు, జైలునుండి బయటికి వచ్చి ఏం చేశాడు..? అతని జీవితం ఏ మలుపు తిరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

క్షేత్రం

నటీ నటులు : జగపతి బాబు, ప్రియమణి

ఇతర నటీనటులు : శ్యామ్, కోట శ్రీనివాస రావు, ఆదిత్య మీనన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : T. వేణు గోపాల్

ప్రొడ్యూసర్ : G. గోవింద రాజు

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2011

జగపతి బాబు, ప్రియమణి నటించిన ఫాంటసీ సినిమా క్షేత్రం. లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురవుతాడు. వీర నరసింహ రాయలు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మి తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మిని చంపేస్తారు. ఆ మోసాన్ని తట్టుకోలేని లక్ష్మి, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం. వీర నరసింహ రాయలు గా జగపతి బాబు నటన ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

శ్రీ మహాలక్ష్మి

నటీనటులు : శ్రీహరి, సుహాసిని  షామ్న

ఇతర నటీనటులు : సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. పవర్ ఫుల్ లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ క్యారెక్టర్ లో కనిపించిన శ్రీహరి నటన సినిమాకే హైలెట్. శ్రీహరికి అక్కగా సుహాసినీ మణిరత్నం సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఒక అమ్మాయిని హత్య చేసిన నేరంలో తొమ్మిది మంది అమ్మాయిలు అరెస్ట్ అవుతారు. ఆ  హత్య నిజానికి ఆ అమ్మాయిలే చేశారా..? లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ ఆ కేసును ఎలా చేధించాడు అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

యాక్షన్ 3D

నటీ నటులు : అల్లరి నరేష్, స్నేహా ఉల్లాల్

ఇతర నటీనటులు : వైభవ్, రాజు సుందరం, శ్యామ్, నీలం ఉపాధ్యాయ్, కామ్న జఠ్మలాని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : బప్పి & బప్పి లహరి, సన్నీ

డైరెక్టర్ : అనిల్ సుంకర

ప్రొడ్యూసర్ : రామబ్రహ్మం సుంకర

రిలీజ్ డేట్ : 21 జూన్ 2013

అల్లరి నరేష్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యాక్షన్ 3D’. 2D, 3D ఫార్మాట్లలో తెరకెక్కిన మొట్టమొదటి కామెడీ చిత్రం. అల్లరి నరేష్ కరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకుడు.

==============================================================================

పోలీస్ స్టోరీ-2

హీరో – సాయికుమార్

నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం

సంగీతం – ఆర్పీ పట్నాయక్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు

విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.

=============================================================================

లవర్స్

నటీనటులు : సుమంత్ అశ్విన్, నందిత

ఇతర నటీనటులు : తేజస్వి మాడివాడ, చాందిని, షామిలి అగర్వాల్, సప్తగిరి, సాయి కుమార్ పంపన, MS నారాయణ, దువ్వాసి మోహన్ & అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : జీవన్ బాబు

డైరెక్టర్ : హరినాథ్

ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగస్వామి & B. మహేంద్ర బాబు

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2014

గర్ల్ ఫ్రెండ్ కోసం ఆరాటపడుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని ట్రై చేసే సిద్దూ ఎఫర్ట్స్ చిత్ర వల్ల స్పాయిల్ అయిపోతాయి. అప్పటి వరకు తనను ఒక్కసారి కూడా చూడని సిద్దు, ఫోన్ లోనే చిత్రతో గొడవ పడతాడు. మరో వైపు ఇంకో అమ్మాయితో సిన్సియర్ గా లవ్ లో పడతాడు. ఆ తరవాత ఏం జరిగిందనేది ప్రధాన కథాంశం.