స్టార్స్ స్టార్ట్ చేసేశారు...

Wednesday,February 15,2017 - 10:06 by Z_CLU

ఎట్టకేలకి టాలీవుడ్లో తమ క్రేజీ ప్రాజెక్ట్స్ ను సెట్స్ పైకి తీసుకొచ్చి… స్టార్ట్-యాక్షన్ చెప్పించుకోవడానికి రెడీ అయ్యారు బడా హీరోలు. మొన్నటివరకూ ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూసిన బడా ప్రాజెక్ట్స్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అవన్నీ ఇప్పుడు ఒకేసారి సెట్స్ పైకి వస్తున్నాయి.

start-action-_-4

ఈ లిస్ట్ లో ముందున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఓ సినిమాను, తమిళ దర్శకుడు నేసన్ తో ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన పవన్… త్వరలోనే ఈ రెండు సినిమాలను సెట్స్ పై పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ ‘కాటమరాయుడు’ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవన్ మార్చి 14 నుంచి త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేస్తాడు.

start-action-_-5

నాగార్జున- ఓంకార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాజు గారి గది-2’. ప్రెజెంట్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాగ్… తొలిసారి హారర్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న చిత్రమిది.. ఈమధ్యే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం సమంతను తీసుకున్నారు.

start-action-_-1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే… క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సమంత ఇందులో హీరోయిన్ గా నటించనుంది.

start-action-_-2

‘జనతా గ్యారేజ్’ తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కూడా బాబీ డైరెక్షన్ లో నటించబోయే తన ప్రతిష్టాత్మక సినిమాకు ఇటీవలే స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మోడ్ లోకి ఎంటర్ అవుతుంది.

start-action-_-3

తాజాగా ఈ లిస్ట్ లో ప్రభాస్ కూడా చేరిపోయాడు. ఇటీవలే ‘బాహుబలి-2’ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాను లేటెస్ట్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పై పెట్టేయాలని భావిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్…