NTR త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Tuesday,February 20,2018 - 07:06 by Z_CLU

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న NTR త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్సయింది. రీసెంట్ గా అల్లు అర్జున్ DJ – దువ్వాడ జగన్నాథమ్ తో ఇంప్రెస్ చేసిన పూజా హెగ్డే, ఇప్పుడు  యంగ్ టైగర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ లో హీరోయిన్ గా నటిస్తున్న పూజా, రీసెంట్ గా మహేష్ బాబు,  వంశీ పైడిపల్లి సినిమాకి కూడా సంతకం చేసింది. దిల్ రాజు నిర్మాణంలో త్వరలోనే సెట్స్ పైకి రానున్న శ్రీనివాస కల్యాణం అనే సినిమాలో కూడా మెరవనుంది. అదే స్పీడ్ లో ఇప్పుడు NTR, త్రివిక్రమ్ సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది.

DJ సినిమాలో అల్లు అర్జున్ కి ధీటుగా స్టెప్స్ వేసి ఇంప్రెస్ చేసిన పూజా హెగ్డే, 2018 లో ఒక్కసారిగా టాప్ స్టార్స్ లిస్టులో చేరనుంది. రీసెంట్ గా రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలోను స్పెషల్ సాంగ్ లో స్టెప్స్ వేసిన  పూజా హెగ్డే, చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

 

హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న NTR మూవీని మ్యాగ్జిమం మార్చిలో సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. తమన్ మ్యూజిక్ కంపోజర్ అని సమాచారం.