జీ సినిమాలు ( 21st ఫిబ్రవరి )

Tuesday,February 20,2018 - 10:02 by Z_CLU

అనగనగ ఒక ధీరుడు

హీరో  హీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర నటీనటులు – లక్ష్మీ మంచు, హర్షిత, సుబ్బరాయశర్మ, రవిబాబు, బ్రహ్మానందం

సంగీతం – సలీమ్ సులేమాన్, ఎం.ఎం.కీరవాణి, కోటి, మిక్కీ జే మేయర్, అనంత్

దర్శకత్వం – ప్రకాష్ కోవెలమూడి

విడుదల తేదీ – 2011, జనవరి 14

తెలుగులో ఫాంటసీ-ఎడ్వెంచరస్ మూవీస్ కాస్త తక్కువే. బడ్జెట్ ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువే అనే ఉద్దేశంతో ఎక్కువమంది ఈ జానర్ ను టచ్ చేయరు. కానీ తొలి సినిమాతోనే అలాంటి రిస్క్ తీసుకున్నాడు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి. అప్పట్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు మూవీని డిస్నీ వరల్డ్ సినిమా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సంయుక్తంగా సమర్పించారు. మంచు లక్ష్మి తొలిసారిగా లేడీ విలన్ గా నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ మూవీకి ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. యోధ అనే మలయాళ సినిమా ఆధారంగా తెరకెక్కిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో భారీ సెట్స్, గ్రాఫిక్స్ కనువిందు చేస్తాయి. 2011 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సిద్దార్థ్ నటన, శృతిహాసన్ అందాలు కూడా తోడయ్యాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోతున్న శృతిహాసన్ కు తొలి తెలుగు చిత్రం ఇదే.

==============================================================================

సంఘర్షణ

నటీనటులు : చిరంజీవి, విజయ శాంతి, నళిని

ఇతర నటీనటులు : శివకృష్ణ, గుమ్మడి, నూతన్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, కాకరాల, రావి కొండల రావు, సరళ, సూర్యకాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : K. మురళీ మోహన రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : డిసెంబర్ 29, 2013

స్మగ్లింగ్ చేస్తూ పెడదారిన పట్టిన తండ్రిని సరైన దారిలో పెట్టడం కోసం ఒక కొడుకు పడ్డ ఘర్షనే ఈ సంఘర్షణ. 1983 లో రామా నాయుడు గారి పుట్టిన రోజున జూన్ 6 న సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా అదే సంవత్సరం డిసెంబర్ 29 న రిలీజైంది. ఇమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

కథా నాయకుడు

నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

=============================================================================

పాపనాశం

నటీనటులు : కమల హాసన్గౌతమినివేద థామస్

ఇతర నటీనటులు : ఎస్తర్ అనిల్కళాభవన్ మణిఆశా శరత్అనంత్ మహదేవన్, M.S. భాస్కర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : జీతూ జోసెఫ్

ప్రొడ్యూసర్ : సురేష్ బాలాజీజార్జి పియూష్

రిలీజ్ డేట్ : 3 జూలై 2015

కమల హాసన్ గౌతమి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ థ్రిల్లర్ పాపనాశం. పాపనాశం అనే ఊళ్ళో కేబుల్ టి.వి. ఆపరేటర్ అయిన హీరోఅనుకోని విపత్తులో తనకుటుంబం ఇరుక్కున్నప్పుడు తనకున్న సినిమా నాలెడ్జ్ తో తనవారిని ఎలా కాపాడుకున్నాడు అనే ఇంటరెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిందే పాపనాశం. ఈ సినిమాలో కమలహాసన్ పర్ఫామెన్స్థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

 

పూజ 

నటీనటులు :  విశాల్, శృతి హాసన్

ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్,  తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ :  యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : హరి

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’.  ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్  హైలైట్స్ .

==============================================================================

లక్కున్నోడు

నటీనటులు : విష్ణు మంచు, హన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : రఘుబాబు, జయప్రకాష్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ : జనవరి 26, 2017

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ, పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి  మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా కథాంశం..