కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్న బెల్లంకొండ

Tuesday,February 20,2018 - 04:34 by Z_CLU

ఇప్పటివరకు సీనియర్ డైరక్టర్లతోనే సినిమాలు చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. కెరీర్ లో ఫస్ట్ టైం ఓ కొత్త కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నాడు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఇతడ గతంలో దృశ్యం, గోపాల గోపాల, డిక్టేటర్ లాంటి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.

వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మాతగా ఈ సినిమా రానుంది. ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ఛోటా కె.నాయుడుని, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను, ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నాను తీసుకున్నారు. హీరోయిన్ ను ఇంకా సెలక్ట్ చేయలేదు.ఎల్లుండి (ఫిబ్రవరి 22న) హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఈ మూవీ ప్రారంభం అవుతుంది.