సింపుల్ గా జరిగిన హీరోయిన్ భావన పెళ్ళి

Monday,January 22,2018 - 03:56 by Z_CLU

త్రిస్సూర్ లోని తిరువంబాడి టెంపుల్ లో హీరోయిన్ భావన, నవీన్ ల పెళ్ళి ఎటువంటి హైప్ లేకుండా చాలా సింపుల్ గా జరిగింది. క్లోజ్ రిలేటివ్స్ సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు కాకుండా, కేవలం ఇరువైపులా ఫ్యామిలీ క్లోజ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ మాత్రమే హాజరు కావడం విశేషం.

త్వరలో జవహర్ లాల్ నెహ్రూ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ జరుపుకోనున్న ఈ జంట రిసెప్షన్ కి కూడా  ఫ్యామిలీ, క్లోజ్ రిలేటివ్స్ నే ఆహ్వానించినట్టు తెలుస్తుంది.

 

పెళ్ళి కి ముందు జరిగిన మెహందీ ఫంక్షన్ లో ఫ్రెండ్స్ తో పాటు డ్యాన్స్ చేసిన భావన ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒంటరి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన భావన, పెళ్ళి తరవాత కూడా సినిమాల్లో యథావిధిగా నటించనుంది.