వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ ఆడియో రిలీజయింది

Monday,January 22,2018 - 01:10 by Z_CLU

ఫిబ్రవరి 9 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సింగిల్ మెగా ఫ్యాన్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ మొత్తం సాంగ్స్ ని ఈ శనివారం రిలీజ్ చేసింది సినిమా యూనిట్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ జ్యూక్ బాక్స్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఈ ‘తొలిప్రేమ’ కూడా ఫ్యాన్స్ ని అదే రేంజ్ లో నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వరుణ్ తేజ్. ‘తొలిప్రేమ’ అనే టైటిల్ పెట్టుకుంటే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయని తెలిసినా, ఈ ‘తొలిప్రేమ’ కూడా అదే రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది కాబట్టే, ధైర్యంగా ఈ టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాం’ అని కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు వరుణ్ తేజ్.

ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని B.V.S.N. ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించాడు. వెంకీ అట్లూరి డైరెక్టర్.