విక్రమ్ ఇంటర్వ్యూ

Monday,January 22,2018 - 04:02 by Z_CLU

విక్రమ్, తమన్నా జంటగా నటించిన ‘స్కెచ్’ టాలీవుడ్ ఈరోజు రిలీజ్ అయింది. రీసెంట్ గా తమిళంలో రిలీజైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా హీరో విక్రమ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం…

అదే స్కెచ్ సినిమా…

ఒక బ్యాంక్ లో కార్ లోన్స్ రికవరీ ఏజెంట్స్ గా పని చేసే గ్రూప్, లోన్స్ రికవరీ చేయడం కోసం స్కెచ్ వేసే గ్రూప్ సడెన్ గా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశారు…? ఏంటది..? ఆ తరవాత వాళ్ళు వేసిన స్కెచ్ ఏంటి…? అనేదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్.

 

అల్ట్రా మాస్ సినిమా…

ఈ సినిమా కంప్లీట్ గా అల్ట్రా మాస్ సినిమా, సినిమాలో కీ ఎలిమెంట్స్ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేశాం. అదే సినిమాలో హైలెట్ పాయింట్. ఈ సిచ్యువేషన్స్ మధ్య సెన్సిటివ్ లవ్ స్టోరీ. సినిమాని మ్యాగ్జిమం రియలిస్టిక్ గా చూపిస్తూనే, ఫాంటసీ ఎలిమెంట్స్ ని ఆడ్ చేశాం.

చాలా ఎగ్జైటెడ్ అయ్యాం…

కథ వినగానే చాలా ఎగ్జైటెడ్ అయ్యాను. తమన్నా కూడా ‘బాహుబలి’ లాంటి బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ తరవాత విన్న స్టోరీ ఇది. తనకి కూడా చాలా నచ్చింది. ఇంత ఎక్స్ట్రా ఆర్డినరీ క్యారెక్టర్స్ దొరకడం నిజంగా అదృష్టం.

ఇది కూడా ఎక్స్ పెరిమెంటే…

విక్రమ్ సినిమా అనగానే ఏదో ఒక ఎక్స్ పెరిమెంట్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. కానీ ఎటువంటి ఎక్స్ పెరిమెంట్ లేని సినిమా చేయడం కూడా నాకు ఎక్స్ పెరిమెంట్ లాంటిదే…

చాలా కొత్తగా ఉంటుంది….

తమన్నా ఈ సినిమాలో చాలా సీరియస్ రోల్ చేసింది. బ్రాహ్మణ అమ్మాయిగా నీట్ గా, పధ్ధతి గల అమ్మాయిలా కనిపిస్తుంది. ఇక నా క్యారెక్టర్ కంప్లీట్ మాస్, గూండాల ఉంటాను. ఇలాంటి వెరీ డిఫెరెంట్ క్యారెక్టర్స్ మధ్య రొమాన్స్ చాలా కొత్తగా అనిపిస్తుంది.

నేనే కావాలని తగ్గించాను…

ఈ స్టోరీలో హీరోయిజం ని ఇంకా చాలా రెట్లు ఎలివేట్ చేసే చాన్సెస్ ఉన్నా, నేనే తగ్గించమన్నాను. అప్పుడే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారు.

స్టోరీ స్లో అవ్వకూడదు…

సినిమాలో ఇంట్రెస్టింగ్ కామెడీ ట్రాక్ ఉన్నా సినిమా స్పీడ్ గా ఉండాలన్న రీజన్ తో కామెడీ ట్రాక్ ని తొలగించాం. సూరికి ఈ విషయంలో సారీ కూడా చెప్పాను. అయినా సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంటుంది. న్యాచురల్ గా నేను, నా ఫ్రెండ్స్ కాంబినేషన్ లో కామెడీ ఉంటుంది. కానీ స్పెషల్ గా కామెడీ ట్రాక్ ఉండదు. సినిమాకి ఆ ట్రాక్ అంతలా అవసరం కూడా లేదు.

నా నెక్స్ట్ సినిమాలు…

ప్రస్తుతం ద్రోణ చేస్తున్నాను, ఆ తరవాత వరసగా సామి, కమల్ హాసన్ బ్యానర్ లో సినిమా, ఆ తరవాత మహావీర సినిమా ఉంటుంది. ఫిబ్రవరిలో ‘ద్రోణ’ సినిమాకి సంబంధించి కంప్లీట్ డీటేల్స్ అనౌన్స్ చేస్తారు. 300 కోట్లతో చాలా మంచి సినిమా ప్లాన్ చేస్తున్నారు.  డీటేల్స్ విన్నాక మీరు షాక్ తినడం ఖాయం. ఆ రేంజ్ లో కాస్టింగ్ ఉంటుంది.

ధృవ్ చేస్తున్న అర్జున్ రెడ్డి సినిమా…

నిజానికి నాకు ధృవ్ ని అప్పుడే లాంచ్ చేయాలన్న ఆలోచన లేదు. ఇది నాన్నగారు తీసుకున్న డెసిషన్. నేను బిగినింగ్ లో సీరియస్ గా తీసుకోలేదు. కానీ ప్రొడ్యూసర్ గారు వచ్చి కన్విన్స్ చేశారు. అందుకే నేనూ ఓకె చెప్పాను. తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాతో ధృవ్ తమిళ్ లో లో లాంచ్ అవ్వడం, అందునా పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న సినిమా చేస్తున్నాడు కాబట్టి హ్యాప్పీ…

బిగ్ బి నా ఇన్స్ పిరేషన్

యాక్టర్ కి ఏజ్ తో సంబంధం ఉండదు. ఈ విషయంలో నాకు బిగ్ బి నా ఇన్స్ పిరేషన్. ఒకవేళ ధృవ్ లేకపోతే నేనే అర్జున్ రెడ్డి సినిమా చేసి ఉండేవాన్ని. ఓల్డ్ క్యారెక్టర్స్ చేయడమన్నా నాకిష్టమే.