గుంటూరోడు ఆడియో రిలీజ్

Monday,January 23,2017 - 07:15 by Z_CLU

మంచు మనోజ్ గుంటూరోడు ఆల్ మోస్ట్ రెడీ ఫర్ రిలీజ్ మోడ్ లో ఉంది. ఫిబ్రవరిలో మంచి టైం చూసుకుని సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్ ఆడియో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసేశారు.

జనవరి 26 న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన సినిమా యూనిట్, ఆ రోజే సినిమా ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజైన ట్రేలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకి శ్రీ వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.