గుంటూరోడు ప్యాకప్ చెప్పేశాడు

Thursday,January 19,2017 - 08:00 by Z_CLU

మంచు మనోజ్ ‘గుంటూరోడు లవ్ లో పడ్డాడు’ ఎడిటింగ్ ల్యాబ్ కి షిఫ్ట్ అయిపోయింది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రగ్యా జైస్వాల్, మనోజ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రేలర్ ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూస్ ని బ్యాగ్ లో వేసుకుంది.

ఫిబ్రవరి సెకండ్ వీక్ లో సినిమాని రిలీజ్ చేయాలని డిసైడ్ అయిన సినిమా యూనిట్ జనవరి లాస్ట్ వీక్ కల్లా ఆడియోని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. శ్రీ వసంత్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.

S.K. సత్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, కోట శ్రీనివాస్ రావు ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించారు.