ఒకే రోజు 2 ఫస్ట్ లుక్స్

Monday,October 31,2016 - 11:57 by Z_CLU

చేసేవి మాస్ సినిమాలే అయినా సినిమాలో ఎక్కువ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ కే ప్రిఫర్ చేస్తాడు మనోజ్. డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఎంచుకుంటూనే ఏదో కొత్తదనాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ మధ్యెప్పుడో రామ్ గోపాల్ వర్మ ఎటాక్ లో కనిపించిన మనోజ్ మళ్ళీ తన తరవాతి సినిమాల గురించి పెద్దగా హల్ చల్ చేయలేదు.

దీపావళి సందర్భంగా తన రాబోయే సినిమాల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసిన మనోజ్, పోటాపోటీగా రిలీజ్ అయిన  బడా సినిమాల ఫస్ట్ లుక్స్ మధ్య కూడా తన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పటిదాకా ఆకతాయి కుర్రాడిలా, మసాలా మాస్ షేడ్స్ లో అలరించిన మనోజ్ తన కరియర్ లోనే ఫస్ట్ టైం “ఒక్కడు మిగిలాడు” సినిమాలో ఒక సీరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కనిపించనున్నాడు. అప్పట్లో శ్రీలంకలో ఉంటున్న తమిళులతో వీరోచిత పోరాటం చేసిన వేళుపిళ్ళై ప్రభాకరన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు.  ఈ సినిమాని అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్నాడు.

gunturodu_1stlook_300dpi

‘ఒక్కడు మిగిలాడు’ తో పాటు ‘గుంటూరోడు లవ్ లో పడ్డాడు’  ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మనోజ్ ఎప్పటిలాగే మాస్ లుక్ లో ఇరగదీస్తున్నాడు. S.K.సత్య డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇలా దీపావళి రోజున ఒకేసారి 2 ఫస్ట్ లుక్స్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు మనోజ్.