టాలీవుడ్ టు కోలీవుడ్

Monday,January 23,2017 - 08:14 by Z_CLU

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఈ ఇయర్ కోలీవుడ్ లోను తమ మార్కెట్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే తెలుగు సినిమా స్క్రీన్ పై అల్టిమేట్ స్టార్ డం ని క్రియేట్ చేసుకున్న ఈ హీరోస్ ఇప్పుడు తమిళ స్క్రీన్ పై కూడా తమ మ్యాజిక్ ని స్ప్రెడ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

mahesh-babu-2

మురుగదాస్ డైరెక్షన్ లో ఇప్పటికే సెట్స్ పై ఉన్న మహేష్ బాబు ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తరవాత  మహేష్ జస్ట్ టాలీవుడ్ కే కాదు కోలీవుడ్ కి కూడా సూపర్ స్టారే.

allu-arjun

ప్రస్తుతం హరీష్ శంకర్ తో DJ సెట్స్ పై ఉన్న స్టైలిష్ స్టార్, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా లింగుస్వామితో సినిమా చేసేస్తాడు. ఆ సినిమా జస్ట్ టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా రిలీజవుతుంది. సో ఈ సినిమాతో కోలీవుడ్ కి సరికొత్త స్టైల్ ఇంట్రడ్యూస్ కానుంది.

prabhas

బాహుబలి సినిమాతో వరల్డ్ సినిమా కి పరిచయం అయిన ప్రభాస్, సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న తన నెక్స్ట్ సినిమాతో ఫుల్ ఫ్లెజ్డ్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ప్లాన్ లో ఉన్నాడు. అలా డార్లింగ్, తమిళ్ ఫ్యాన్స్ కి క్లోజ్ కాబోతున్నాడు. 

ntr

 టాలీవుడ్ నం 1 స్టార్ లిస్టులో ఉన్న NTR కూడా ఈ ఇయర్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. రేపో మాపో బాబీ సినిమాతో సెట్స్ పైకి రానున్న NTR ఈ ఇయర్ టాలీవుడ్ లోను సినిమా రిలీజ్ చేసే చాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

 manchu-vishnu

ఈ ఇయర్ లక్కున్నోడు తో ఎంటర్ టైన్ చేయనున్న మంచు విష్ణు, G.S. కార్తీక్ తో ఆల్ రెడీ ఓ యాక్షన్ ఎంటర్ టైన్ ని సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. సో మంచు విష్ణు కూడా ఈ ఇయర్ తరవాత కోలీవుడ్ స్టార్ లిస్టు లో చేరిపోతాడు.

సినిమా సినిమాకి తమ స్టాండర్డ్స్ ని, మార్కెట్ ని ఇంప్రూవ్ చేసుకుంటున్న స్టార్స్ ఈ సారి మెల్లిగా ఇండస్ట్రీ బ్యారియర్స్ ని చెరిపేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే కోలీవుడ్ లోను పర్మనెంట్ ప్లేస్ లో సెటిల్ అవ్వడం మరీ టఫ్ఫేం కాదనిపిస్తుంది.