గుంటూరోడి రిలీజ్ డేట్

Thursday,February 16,2017 - 12:46 by Z_CLU

అల్టిమేట్ లవ్ & మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న గుంటూరోడు లవ్ లో పడ్డాడు రిలీజ్ డేట్ ఫిక్సయింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి S.K. సత్య డైరెక్టర్.

ప్రస్తుతం సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, మార్చి 3 న సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మనోజ్ కరియర్ లో బిగ్గెస్ట్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గుంటూరోడు, రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది.

DJ వసంత్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్టయింది. దానికి తోడు ట్రేలర్ లో మంచు మనోజ్ మ్యానరిజం, యాక్షన్ సీక్వెన్సెస్ న్యాచురల్ గానే సినిమాపై ఇంట్రెస్ట్ ని ఇంక్రీజ్ చేస్తున్నాయి.