ఏడాది ప్రారంభంలోనే కొత్త టాలెంట్

Thursday,February 01,2018 - 05:23 by Z_CLU

టాలీవుడ్ కు ఏటా కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉంటారు. కానీ ఈ ఏడాదికి మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. ఈ  నెలలోనే చాలా మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అది కూడా క్రేజీ మూవీస్ తో కావడం విశేషం. ఇయర్ స్టార్టింగ్ లోనే హల్ చల్ చేస్తున్న ఆ డెబ్యూ డైరెక్టర్స్ పై ఓ లుక్కేద్దాం.

వెంకీ కుడుముల (ఛలో)

ఓ చిన్న సినిమా సోషల్ మీడియాలో హంగామా చేస్తూ రిలీజ్ కి ముందే పాజిటీవ్ టాక్ అందుకుంటుంది. అదే ‘ఛలో’.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవ్తున్నాడు వెంకీ కుడుముల. గతంలో తేజ , త్రివిక్రమ్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వెంకీ ఈ సినిమాతో ఎట్టకేలకి మెగా ఫోన్ పట్టాడు. కేవలం ఒక సినిమాకి కలిసి పనిచేసిన పరిచయంతో నాగ శౌర్య  ఓ సొంత బ్యానర్ స్థాపించి వెంకీ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడంటే ఈ డెబ్యూ డైరెక్టర్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.


విక్రం సిరికొండ (టచ్ చేసి చూడు)

ఇప్పటికే హీరోగా కొందరు కొత్త దర్శకులను పరిచయం చేసి వాళ్లకి ఓ ఫ్లాట్ ఫాం క్రియేట్ చేసిన రవితేజ మరో డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు. అతడే విక్రమ్ సిరికొండ. మొదటి సినిమాకే మాస్ రాజాను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేయడంతో అందరి ఫోకస్ విక్రమ్ సిరిపై పడింది. గతంలో వినాయక్  హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి వంటి స్టార్ డైరెక్టర్స్  దగ్గర  వర్క్ చేసిన అనుభవంతో దర్శకుడిగా మారాడు విక్రమ్ సిరి.


వెంకీ అట్లూరి (తొలి ప్రేమ)

లేటెస్ట్ గా ఓ యంగ్ రైటర్ కం హీరో కూడా మెగా ఫోన్ పట్టేశాడు. గతంలో ‘స్నేహగీతం’ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోగా నటించి ఆ తర్వాత కేరింత అనే సినిమాకు రచయితగా పనిచేసిన వెంకీ అట్లూరి ‘తొలిప్రేమ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టాలెంట్ ఉందనిపిస్తే  కచ్చితంగా ఎంకరేజ్ చేసి తన బ్యానర్ లో చాన్స్ ఇచ్చే  దిల్ రాజు అప్పట్లో వెంకీ చెప్పిన స్టోరీ- స్క్రీన్ ప్లే కి మెస్మరైజ్ అయ్యాడు. కాని ప్రాజెక్ట్ కాస్త లేట్ అవ్వడంతో బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లో డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు వెంకీ.

శరణ కొప్పిశెట్టి (కిరాక్ పార్టీ) :

గతంలో సుధీర్ వర్మ, చందూ మొండేటి దగ్గర  పనిచేసిన శరణ్ కొప్పిశెట్టి త్వరలోనే ‘కిరాక్ పార్టీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ‘కిర్రిక్ పార్టీ’సినిమాకు రీమేక్.  ఇప్పటికే సాంగ్ , టీజర్ తో హంగామా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని త్వరలోనే థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.

రమేష్-గోపి  (ఇది నా లవ్ స్టోరీ)

లవర్ బాయ్ తరుణ్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’ ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకులుగా పరిచయం అవుతున్నారు రమేష్ – గోపి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొల్పాయి. దర్శకులుగా ఇద్దరైనా కలిసికట్టుగా సినిమాను తెరకెక్కించి టీజర్ తోనే  తమ టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు… వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న వస్తోంది ఈ సినిమా.

ప్రశాంత్ వర్మ (అ!)

నిజానికి ఓ కాన్సెప్ట్ విన్న హీరో ఆ సినిమా నేనే నిర్మిస్తా అంటే ఆ డెబ్యూ డైరెక్టర్ కి అంతకంటే ఇంకేం కావాలి. ? ఇప్పుడు  అలాంటి అనుభూతినే ఎంజాయ్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.  నాని నిర్మాతగా రూపొందుతున్న ‘అ!’ సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు ప్రశాంత్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్ తో పాటు అందరి ప్రశంశలు అందుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది.