సుకుమార్ డైరెక్షన్ లో మెగాస్టార్

Thursday,February 01,2018 - 06:16 by Z_CLU

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సెట్స్ పై ఉన్నాడు సుకుమార్. అయితే ఈ క్రియేటివ్ జీనియస్ డైరెక్షన్ లో నటించడానికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రీసెంట్ గా చిరుకి ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ వినిపించాడట సుకుమార్.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి ‘సైరా’ సినిమాలో నటిస్తున్న చిరు, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ‘సైరా’ సినిమాలో నరసింహా రెడ్డి లా మెస్మరైజ్ చేయనున్న చిరు, బోయపాటి సినిమాలో మాస్ ఇంపాక్ట్ తో అదరగొట్టబోతున్నాడు.

ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే కి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న సుక్కు, మెగాస్టార్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడా..? అనే ఆలోచన అప్పుడే మెగా ఫ్యాన్స్ లో క్యూరాసిటీ జెనెరేట్ చేస్తుంది. మరి ఈ వెంచర్ అఫీషియల్ గా కన్ఫం అయి, సెట్స్ పైకి ఎప్పుడు రానుందో వేచి చూడాల్సిందే.