'@నర్తన శాల' పై నాగ శౌర్య ఫుల్ కాన్ఫిడెంట్

Sunday,August 26,2018 - 09:02 by Z_CLU

లేటెస్ట్ గా తన సొంత బ్యానర్ ‘ఐరా క్రియేషన్స్’ లో ఛలో అంటూ సూపర్ హిట్ అందుకున్న నాగ శౌర్య లేటెస్ట్ గా తన బ్యానర్ లో ‘నర్తనశాల’ అనే సినిమా చేసాడు. ఈ సినిమాతో శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 30 థియేటర్స్ లోకి రానుంది. లేటెస్ట్ గా ఈ సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ ను బయటపెట్టాడు హీరో నాగ శౌర్య.

సినిమా మాకు బాగా నచ్చింది.. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితేనే సినిమా చూడండి.. నచ్చకపోతే ఎవ్వరూ చూడొద్దు. నచ్చితే మాత్రం ఇంకో పదిమందికి చెప్పండి.. అంటూ కాన్ఫిడెంట్ గా సినిమా గురించి చెప్పాడు. మరి నాగ శౌర్య కి ‘నర్తనశాల’ ఛలో రేంజ్ హిట్ అందిస్తుందా.. చూడాలి.