స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న రాజమౌళి నెక్స్ట్ సినిమా

Thursday,February 01,2018 - 03:31 by Z_CLU

బాహుబలి సినిమా తరవాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కనున్న మూవీ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ స్టేజ్ లో ఉంది. టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్స్ N.T.R., రామ్ చరణ్ లు హీరోలుగా నటించనున్న ఈ సినిమాపై క్రేజీ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ నెవర్ సీన్ బిఫోర్ కాంబినేషన్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చినా టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

ప్రస్తుతం ‘రంగస్థలం’ సినిమాతో సెట్స్ పై ఉన్న రామ్ చరణ్, త్వరలో బోయపాటి శ్రీను సినిమాతో బిజీ కానున్నాడు. మరోపక్క NTR కూడా రేపో మాపో త్రివిక్రమ్ సినిమాతో సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ లెక్కన ప్రస్తుతం చేతిలో ఉన్న ఈ సినిమాలకు ప్యాకప్ చెప్పీ చెప్పగానే రాజమౌళి సినిమాకి డేట్స్ లాక్ చేయనున్నారు ఈ హీరోలు.

ఇకపోతే కరెక్ట్ టైమ్ చూసుకుని ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్న రాజమౌళి టీమ్, మ్యాగ్జిమం 2018 సెకండాఫ్ లో సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాను D.V.V. దానయ్య నిర్మిస్తున్నాడు.