మే 18న గోపీచంద్ `పంతం` రిలీజ్

Thursday,February 08,2018 - 11:03 by Z_CLU

గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పంతం’. బలుపు, పవర్, జై లవకుశ లాంటి భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ స్క్రేనే ప్లే రాసిన K. చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ ఈ సినిమాని మే 18 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

ఇప్పటికే ఒక సాంగ్ తో పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించిన సినిమా యూనిట్, ప్రస్తుతం ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉండబోయే యాక్షన్ సీక్వెన్సెస్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తుంది. గోపీచంద్ కి ఇది 25 వ సినిమా కావడం విశేషం.

 

గోపీచంద్ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. K.K. రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.