వణికించే చలిలో సాంగ్ షూటింగ్ చేస్తున్న బన్నీ

Thursday,February 08,2018 - 12:08 by Z_CLU

వణికించే చలిలో మొన్నటివరకు ఫైట్స్ చేశాడు బన్నీ. ఇప్పుడు అదే చలిలో సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పై శ్రీనగర్ లో ఓ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. నా పేరు సూర్య సినిమాలో ఈ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతోంది యూనిట్.

భారత్-పాక్ బోర్డర్ లో ఉన్న శ్రీనగర్ లో ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది. అయినప్పటికీ ఆ చలిని లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు బన్నీ. యూనిట్ కు రక్షణగా ఇండియన్ ఆర్మీ పహారా కాస్తోంది. ఈ వీకెండ్ తో శ్రీనగర్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది.

అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకుడు. రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన సైనిక సాంగ్ సూపర్ హిట్ అవ్వగా, వాలంటైన్స్ డే కానుకగా మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నారు.