మహేష్ బాబును కన్విన్స్ చేయలేకపోయా – వి.వి.వినాయక్

Thursday,February 08,2018 - 10:03 by Z_CLU

మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నం 150’ సినిమా తరవాత సాయి ధరమ్ తేజ్ తో ‘ఇంటిలిజెంట్’ మూవీకి దర్శకత్వం వహించాడు వి. వినాయక్. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన వినాయక్ ఫ్యూచర్ లో మహేష్ బాబుతో  సినిమా గ్యారంటీగా ఉంటుందని కన్ఫం చేశాడు.

మహేష్ బాబు తో ఇప్పటికే డిస్కర్షన్స్ బిగిన్ చేసిన వినాయక్, కథ సరిగ్గా కుదరకపోవడం వల్లే సినిమా ఆలస్యం అవుతుందని, రెండు మూడు సార్లు సూపర్ స్టార్ తో స్టోరీ లాక్ చేసే ప్రయత్నం చేసినా, కథ కన్విన్సింగ్ గా లేకపోవడంతో ముందుకు వెళ్ళలేకపోయామని చెప్పుకున్నాడు వినాయక్.

ఏ రేంజ్ స్టార్ నైనా మరింత మాసివ్ గా ప్రెజెంట్ చేసే వినాయక్ డైరెక్షన్ లో మహేష్ బాబును చూడటమంటే  ఫ్యాన్స్ కి పండగలాంటి ఈవెంటే. ప్రస్తుతం ఇంటిలిజెంట్ మూవీ రిలీజ్ పనులలో బిజీగా ఉన్న వినాయక్, ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా మహేష్ బాబు సినిమా కథపై కూర్చుంటాడా..? లేకపోతే ఈ క్రేజీ కాంబోని సెట్స్ పైకి తీసుకురావడానికి మరింత టైం తీసుకుంటాడా..? అనేది వేచి చూడాల్సిందే.