వీకెండ్ రిలీజెస్

Thursday,July 05,2018 - 10:03 by Z_CLU

లాస్ట్ వీక్ ఏకంగా 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర జస్ట్ ఆవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటే మరికొన్ని సినిమాలు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతున్నాయి. అయితే ఈ బాక్సాఫీస్ బరిలో ఈ వారం మరికొన్ని సినిమాలు చేరనున్నాయి. వాటి వివరాలు…

 

పంతం : గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన సినిమా పంతం. ఇది గోపీచంద్ కరియర్ లో 25 వ సినిమా కావడంతో ఇప్పటికే ఈ  సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాలిటిక్స్, సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్ లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ సినిమాకి K. చక్రవర్తి డైరెక్టర్.

తేజ్ I love u : సాయి ధరమ్ తేజ్ కరుణాకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ ఎంటర్ టైనర్. ఈ నెల 6 న రిలీజవుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే మెస్మరైజింగ్ టైటిల్ తో ఇంప్రెస్ చేసిన ఫిల్మ్ మేకర్స్, సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

 

దివ్యమణి :  గిరిధర్ గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ దివ్యమణి. కలం హీరోగా నటించిన ఈ సినిమాలో వైశాలి, కిమయా హీరోయిన్స్ గా నటించారు. స్టీవ్ శ్రీధర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో స్టంట్స్ హైలెట్ కానున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఈ నెల 6 న గ్రాండ్ గా రిలీజవుతుంది.