హీరో గోపీచంద్ ఇంటర్వ్యూ

Friday,October 04,2019 - 05:28 by Z_CLU

మ్యాచో హీరో గోపీచంద్ ‘చాణక్య’ సినిమాతో రేపే థియేటర్స్ లోకి రానున్నాడు. తిరు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రా ఏజెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు గోపీచంద్. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు గోపి. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

 

ఫస్ట్ టైం

స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయడం ఇదే మొదటి సారి. సినిమాలో రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసాను. తిరు ఈ కథ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందుకే విన్న వెంటనే ఒకే చెప్పేసాను.

అంచనాలను అందుకుంటా

ఈ సినిమా మీద ఎన్ని అంచనాలున్నా వాటన్నిటిని అందుకుంటాను. కథ మీద దర్శకుడి, మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అవుట్ పుట్ కూడా మేము అనుకున్నట్లే వచ్చింది. సో రేపు ఎట్టి పరిస్థితిల్లో సినిమా ఆడియన్స్ ను డిసపాయింట్ చేయదు.

తిరు…బాగుందన్నాడు

సినిమా స్టార్ట్ అవ్వకముందు డైరెక్టర్ తిరు ఓ రోజు మా ఇంటికొచ్చాడు. అప్పుడు నేను గెడ్డం పెంచుకొని ఉన్నాను. ఈ లుక్ బాగుంది మన సినిమాలో వాడదాం సార్ అన్నాడు. ఒకే అనేసాను. అలా నేను సరదాగా పెంచిన గెడ్డంతోనే ఇందులో కొత్త లుక్ లో కనిపించబోతున్నాను.

చాణక్య …ఓ మిషన్

‘చాణక్య’ అనేది సినిమాలో మిషన్ పేరు. ఆ మిషన్ ఏంటనేది రేపు స్క్రీన్ మీద చూడబోతున్నారు. తిరు ఈ టైటిల్ చెప్పగానే అందరికీ బాగా నచ్చేసింది. క్యాచీగా కూడా ఉందన్న ఉద్దేశ్యంతో పెట్టేశాం.

క్రెడిట్ వెట్రికే

ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాని అందరూ చెప్తున్నారు. నిజానికి నా లుక్ అంత ఎట్రాక్ట్ చేయడానికి రీజన్ సినిమాటోగ్రాఫర్ వెట్రినే. నన్ను డిఫరెంట్ గా చూపించాడు. సినిమాలో నా లుక్ అందరికీ నచ్చుతుంది.

సినిమా అంటే ఎంతో ఇష్టం

అనిల్ గారి బ్యానర్ లో సినిమా చేయడం ఇదే మొదటి సారి అంతకుముందు అనుకున్నాం కానీ కుదరలేదు. ఫైనల్ గా ‘చాణక్య’తో మా కాంబినేషన్ కుదిరింది. అనిల్ గారికి సినిమా అంటే ఎంతో ఇష్టం. ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు. ఆయనతో మళ్ళీ మళ్ళీ చేయాలనుంది.

కష్టం అనిపించలేదు

నిజానికి ఈ సినిమా కోసం కొంచెం ఎక్కువ కష్టపడ్డాను. కానీ ఎప్పుడూ కష్టం అనిపించలేదు. చాలా కూల్ గా చేస్తూ వెళ్ళిపోయాను.

మ్యూజిక్… బ్యాక్ బోన్

సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీ రోల్ ప్లే చేసింది. కథ చెప్పగానే ఈ సినిమాకు మంచి నేపథ్యం అందించే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని అనుకున్నాం. అందుకే నేపథ్య సంగీతం కోసం శ్రీ చరణ్ ని తీసుకున్నాం. సినిమాకు తమ మ్యూజిక్ ప్లస్ అవుతుంది.

నెక్స్ట్ సినిమాలివే

నెక్స్ట్ బిను సుబ్రహ్మణ్యంతో ఓ సినిమా చేస్తున్నాను. అది ఓ అడ్వెంచర్ సినిమా. ఆడియన్స్ కు ‘సాహసం’ లాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అలాగే సంపత్ నందితో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాను. ఆ సినిమా కబడ్డీ నేపథ్యంలో ఉండబోతుంది.