తేజ దర్శకత్వం, బెల్లంకొండ హీరో, కాజల్ హీరోయిన్

Wednesday,July 04,2018 - 03:00 by Z_CLU

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న తర్వాత తేజ నెక్ట్స్ సినిమాపై చాలా పుకార్లు వినిపించాయి. ఒక దశలో హీరో నానితో తేజ సినిమా ఉంటుందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత డీవీవీ దానయ్య కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తాడంటూ పుకార్లు వినిపించాయి. ఎట్టకేలకు తేజ తన నెక్ట్స్ ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా రాబోతోంది.

7వ తేదీ నుంచి ఈ సినిమా డైరక్ట్ గా సెట్స్ పైకి వెళ్తుంది. కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత, అప్పుడు ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫస్ట్ లుక్ తో పాటు సినిమాను ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నాడు తేజ.

ఇన్నాళ్లూ పక్కా మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్లు చేసిన బెల్లంకొండ, తేజ సినిమాలో కాస్త కొత్తగా కనిపించబోతున్నాడట. నటించడానికి వంద శాతం స్కోప్ ఉన్న క్యారెక్టర్ అట. ఇందులో సాయిశ్రీనివాస్ సరసన మరోసారి కాజల్ హీరోయిన్ గా నటించనుంది. వీళ్లిద్దరూ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు.