డబ్బింగ్ చెప్పిన బన్నీ బ్యూటీ

Tuesday,May 09,2017 - 03:15 by Z_CLU

గోపీచంద్ ‘గౌతమ్ నంద’ ఆల్ మోస్ట్ టాకీపార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో హన్సిక మోత్వాని తో పాటు కేథరిన్ థెరిసా కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా తన కరియర్ కి పెద్ద ప్లస్ అవ్వడం కన్ఫం అని కాన్ఫిడెంట్ గా ఉన్న కేథరిన్ ‘గౌతమ్ నంద’ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.

ఎప్పటి నుండి తన రోల్ కి తానే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్న కేథరిన్ కి ఈ సినిమా డైరెక్టర్ సంపత్ నంది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాలో తానే డబ్బింగ్ చెప్పుకుంది కేథరిన్. ఈ సినిమాలో మాడరన్ ఎనర్జిటిక్ అమ్మాయిలా కనిపించనున్న కేథరిన్, తన క్యారెక్టర్ పోర్షన్ ని మ్యాగ్జిమం బ్యాంకాక్ లో షూట్ చేసినట్టు చెప్పుకుంది.

రైట్ టైమ్ చూసుకుని టీజర్ తో పాటు ఈ సినిమా ఆడియో రిలీజ్ కి సంబంధించిన డీటేల్స్ ని కూడా రివీల్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, ఫాస్ట్ పేజ్ లో తక్కిన షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉంది.