మరో రీమేక్ తో వెంకీ ?

Tuesday,May 09,2017 - 04:35 by Z_CLU

టాలీవుడ్ రీమేక్ రాజాగా గుర్తింపు అందుకున్న విక్టరీ వెంకటేష్ మరో రీమేక్ కి రెడీ అవుతున్నాడు.. లేటెస్ట్ గా హిందీ- తమిళ్ లో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన ‘సాలా ఖదూస్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసి తన లుక్, కోచ్ క్యారెక్టర్ తో తెలుగు ఆడియన్స్ ను సరికొత్తగా ఎంటర్టైన్ చేసిన వెంకీ ప్రెజెంట్ మరో రీమేక్ సినిమాతో ఎంటర్టైన్ చేయబోతున్నాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది..

ఇటీవలే హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘జాలీ ఎల్.ఎల్.బి-2’ సినిమా బాలీవుడ్ లో గ్రాండ్ హిట్ గా నిలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించిన తెలుగు రీమేక్ రైట్స్ ను సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ దక్కించుకుంది.. ఈ సినిమాను వెంకటేష్ చేస్తే బాగుంటుందని భావించిన నిర్మాతలు లేటెస్ట్ గా ఈ రీమేక్ కోసం వెంకీ ను సంప్రదించినట్లు ఈ సినిమా వెంకీ కూడా బాగా నచ్చడంతో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.