హీరోయిన్లకు అతడు గోల్డెన్ హ్యాండ్

Wednesday,September 07,2016 - 01:14 by Z_CLU

 

టాలీవుడ్ లో బంపర్ అఫర్ అందుకుంది రెజీనా. టాలీవుడ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తరువాత ఆ రేంజ్ లో హీరోయిన్లను అందంగా చూపించేది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీనే. నిన్నే పెళ్లాడతా సినిమాతో టబు ను అద్భుతంగా చూపించి అమ్మడు కి టాలీవుడ్ లో అభిమానులను పెంచేసిన కృష్ణ వంశీ ఆ తర్వాత సంఘవి, ఇషా కొప్పికర్, సౌందర్య, సాక్షి శివానంద్ వంటి నాయికలను ఎంతో అందం గా చూపించి ఆ అందం తో ప్రేక్షకులను ఫిదా చేసాడు. ఇక ‘మురారి’ తో సోనాలి ని ‘చందమామ’ తో కాజల్ ను, ‘శ్రీ ఆంజనేయం’ తో ఛార్మి ను, ‘శశి రేఖ పరిణయం’ తో జెనీలియా ని, ‘మొగుడు’తో తాప్సి ను ‘పైసా’ తో క్యాథెరిన్ ను…. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లుగా మార్చేశాడు కృష్ణవంశీ. అలాంటి దర్శకుడి చిత్రం లో కథానాయికగా అవకాశం అందుకుంది రెజీనా. కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే సినిమా చేస్తోంది. ‘నక్షత్రం’ తో రెజీనా కూడా కుర్రాళ్ల గుండెల్లో మరింత ఫిక్స్ అయిపోతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.