Mishan Impossible చిన్న సినిమాకు మెగా సపోర్ట్

Tuesday,March 29,2022 - 04:57 by Z_CLU

Megastar Chiranjeevi to grace the Pre-Release Event of ‘Mishan Impossible’

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో దర్శకుడిగా సక్సెస్ తో పాటు మంచి గుర్తింపు అందుకున్న స్వరూప్ RSJ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ముగ్గురు పిల్లలతో తెరకెక్కిన ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ కాబోతుంది. ఇటివలే సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసి సపోర్ట్ అందించాడు. మహేష్ రిలీజ్ చేయడంతో ట్రైలర్ బాగా రీచ్ అయింది.  ఇప్పుడు మెగాస్టార్ వంతు.  చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారు.

MEGA STAR

మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రేపు హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈవెంట్ జరగనుంది. ఈ చిన్న సినిమా గురించి తెలుసుకొని నాలుగు మాటలు చెప్పి తన మెగా స్పీచ్ తో మెగా సపోర్ట్ అందించబోతున్నారు చిరు. ప్రస్తుతం టీం సినిమాకు సంబంధించి చురుగ్గా ప్రమోషన్స్ చేస్తున్నారు. రేపు మెగా ఈవెంట్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవ్వడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.

తాజాగా ఈ  సినిమాకు హీరో నవీన్ పోలిశెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే యంగ్ డైరెక్టర్స్  వీడియో బైట్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. ఒక పక్కా RRR భారీ కలెక్షన్స్ తో ఆడుతుండగా ఈ చిన్న సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. మరి ఈ భారీ కాంపిటీషన్ లో ‘మిషన్ ఇంపాజిబుల్’ ప్రేక్షకులను ఆకర్షించి థియేటర్స్ లోకి తీసుకొస్తుందా ? వేచి చూడాలి.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics