సమంత మనసు మార్చుకుంటుందా?

Wednesday,September 07,2016 - 12:05 by Z_CLU

 

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లిస్ట్ లో కచ్చితంగా సమంత పేరు ఉంటుంది. తక్కువ సమయం లో ఎక్కువ మంది స్టార్ హీరోల్ని కవర్ చేసిన ఏకైక హీరోయిన్ గా సమంత పేరుతెచ్చుకుంది. చుల్ బులీ నటించిన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా విడుదలై వారం రోజులు అయింది. గతంలో ఒకేసారి 2-3 సినిమాలకు కాల్షీట్లు ఇచ్చే సమంత, ప్రస్తుతం జనతా గ్యారేజ్ విడుదలై వారం అయినా… తెలుగులో తన కొత్త సినిమా సంగతులు చెప్పలేదు. సమంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రూమర్లకు మరింత బలమిస్తూ, ఆమె ఇప్పటివరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది కాబట్టే.. సినిమాలు చేయడం లేదని చాలామంది భావిస్తున్నారు. అయితే సేమ్ టైం ఓ తమిళ సినిమాలో నటించేందుకు సమంత ఒప్పుకోవడం అందర్లో అనుమానాలు రేకెత్తించింది. ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతుందా… లేక కోలీవుడ్ కే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటోందా… ఏదేమైనా ప్రస్తుతానికైతే సమంత చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి కూడా ఆమె ఇష్టపడడం లేదు. జనతా గ్యారేజ్ ప్రమోషన్ యాక్టివిటీస్ లో ఈ ప్రశ్నకు సమంత అసలు జవాబే చెప్పలేదు.