దుమ్ముదులుపుతున్న గీతగోవిందం

Friday,August 24,2018 - 01:12 by Z_CLU

బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది గీతగోవిందం. ఇప్పటికే షేర్ పరంగా 40 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన ఈ సినిమా, నిన్నటి వసూళ్లతో మరో రికార్డు క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ వసూళ్లలో 75 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రంగా అవతరించింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో 75 కోట్ల రూపాయల గ్రాస్ సాధించడం ఇదే ఫస్ట్ టైం.

త్వరలోనే ఈ సినిమా షేర్ పరంగా 50 కోట్లు, గ్రాస్ పరంగా 100 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేయబోతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. మరో 5 రోజుల్లో ఈ రెండు రికార్డుల్ని ఒకేసారి క్రాస్ చేసే అవకాశం ఉంది.

గోవింద్ గా విజయ్ దేవరకొండ, గీతగా రష్మిక నటన ఈ సినిమాకు మేజర్ హైలెట్ గా నిలవగా.. పరశురారం రైటింగ్, డైరక్షన్ సినిమాను నిలబెట్టాయి. రాబోయే రోజుల్లో గీతగోవిందం నుంచి మరిన్ని రికార్డులు రాబోతున్నాయి. గెట్ రెడీ.