మహర్షిని కలిసిన గోవింద్

Friday,August 24,2018 - 01:32 by Z_CLU

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టిల్ వైరల్ అవుతోంది. పైన మీరు చూస్తున్న పిక్ అదే. అవును.. మహర్షి సెట్ లో విజయ్ దేవరకొండ ప్రత్యక్షమయ్యాడు. అలా మహేష్-విజయ్ దేవరకొండ కలిసి దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. మహేష్ ను కలవడం చాలా ఆనందంగా ఉందంటుున్నాడు విజయ్ దేవరకొండ.

“మహేష్ సినిమా టిక్కెట్ల కోసం ఫైట్ చేసిన నేను, ఈరోజు ఆయనతో కలిసి సినిమాల గురించి డిస్కస్ చేస్తున్నాను. నిజంగా నమ్మలేకపోతున్నాను” అంటూ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ ఆ ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

గీతగోవిందం సినిమా హిట్ అయిన సందర్భంగా విజయ్ దేవరకొండతో పాటు యూనిట్ లో అందర్నీ మెచ్చుకున్నాడు మహేష్. అందుకే మహేష్ కు థ్యాంక్స్ చెప్పేందుకు మహర్షి సెట్స్ కు వెళ్లాడు విజయ్ దేవరకొండ.