మరో రికార్డు సృష్టించిన గీతగోవిందం

Monday,September 17,2018 - 11:04 by Z_CLU

విడుదలై నెల రోజులైనా గీతగోవిందం హంగామా ఏమాత్రం తగ్గలేదు. ప్రతి థియేటర్ లో ఈ సినిమా అంతో ఇంతో వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా ఇన్ని రోజులైనా ఇంకా స్టడీగా కొనసాగుతుండడం విశేషం. తాజాగా ఓవర్సీస్ లో మరో రికార్డు క్రియేట్ చేసింది గీతగోవిందం.

ఇప్పటికే ఓవర్సీస్ టాప్-10 మూవీస్ క్లబ్ లోకి చేరిన ఈ సినిమా, తాజాగా ఏడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో అ..ఆ, ఖైదీనంబర్ 150 లైఫ్ టైం వసూళ్లను క్రాస్ చేసింది విజయ్ దేవరకొండ సినిమా.

యూఎస్ టాప్-10 సినిమాలు
1. బాహుబలి-2 – $ 2,01,17,274
2. బాహుబలి – $ 6,999,312
3. రంగస్థలం – $ 3,513,450
4. భరత్ అనే నేను – $ 3,416,451
5. శ్రీమంతుడు – $ 2,890,786
6. మహానటి – $ 2,543,515
7. గీతగోవిందం – $ 2,454,233
8. అ..ఆ – $ 2,449,174
9. ఖైదీ నంబర్ 150 – $ 2,447,043
10. ఫిదా – $ 2,066,937