కోకో కోకిల సెన్సార్ పూర్తి

Friday,August 24,2018 - 12:49 by Z_CLU

నయనతార లీడ్ రోల్ పోషించిన కోకో కోకిల గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. కోలీవుడ్ లో ఇప్పటికే సూపర్ హిట్ అయిన ఈ సినిమా 31న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదలకాబోతోంది. ఈ మేరకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది.

నయనతార కెరీర్ లోనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది కోకో కోకిల. ఇప్పటివరకు కోలీవుడ్ లో ఏ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి ఇన్ని వసూళ్లు రాలేదు. కోలీవుడ్ బాక్సాఫీస్ లో ఉన్న గ్యాప్ కారణంగా ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది.

క్రైమ్-కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది కోకో కోకిల. ఇలాంటి సబ్జెక్ట్ లో నయనతార ఇప్పటివరకు నటించలేదు. అమాయకంగా కనిపించే కోకిల పాత్రలో అద్భుతంగా నటించిన నయనతారను కోలీవుడ్ ప్రముఖులంతా మెచ్చుకుంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.