యంగ్ విలన్ చుట్టూ క్యూరియాసిటీ

Thursday,July 25,2019 - 12:03 by Z_CLU

‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు కార్తికేయ. సినిమాలో ఓ ఐదు క్యారెక్టర్స్ ఈ విలన్ పై రివేంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ రివేంజర్స్ గ్యాంగ్ కి లీడర్ నాని. ఈ విషయం టీజర్ చూడగానే అర్థమైపోయింది. కానీ సినిమాలో విలన్ సంగతేంటి…?

టీజర్ లో జస్ట్ కొన్ని సెకన్స్ రివీల్ చేసీ చేయకుండా అన్నట్టు ప్రెజెంట్ చేశారు మేకర్స్ కార్తికేయని. ఆ కాసేపు కనిపించిన గెటప్ ని బట్టి రేసర్ అని అనిపిస్తున్నా… ఈ గ్యాంగ్ కక్ష కట్టి రివేంజ్ తీసుకోవాలని ఎందుకనుకున్నారో మాత్రం ఎంతకీ తట్టట్లేదు.   

మేకర్స్ కూడా ఈ క్యూరియాసిటీని అదే స్థాయిలో మెయిన్ టైన్ చేస్తున్నారని అర్థమైపోతుంది. అందుకే సినిమాలో నాని తరవాత ఆడియెన్స్ తరవాత ఇమ్మీడియట్ గా కార్తికేయపై నిలుస్తుంది.

ఈ క్యూరియాసిటీ కి తగ్గట్టు రేపు సినిమా రిలీజయ్యాక కార్తికేయ క్యారెక్టర్ కూడా అదే స్థాయిలో మెస్మరైజ్ చేయాలే కానీ, టాలీవుడ్ కి యంగ్ విలన్ దొరికినట్టే.. అనుమానం లేదు.