చాణక్య లేటెస్ట్ అప్ డేట్స్

Monday,August 26,2019 - 11:55 by Z_CLU

గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా చాణక్య. తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూనిట్ అంతా ఇటలీ వెళ్లింది. అక్కడ ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారు. ఈ పాటతో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.

మూవీలో రా (RAW) ఏజెంట్ గా కనిపించబోతున్నాడు గోపీచంద్. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా పేరుతెచ్చుకుంది. మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనీల్ సుంకర నిర్మాత.

చాణక్యపై చాలా ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్. రీసెంట్ గా అతడు నటించిన సినిమాలేవీ పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోవడంతో.. చాణక్యతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు. కెరీర్ లో ఇతడికిది 26వ సినిమా.