మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ అప్ డేట్స్

Sunday,February 09,2020 - 02:51 by Z_CLU

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. హైద‌రాబాద్, అమెరికా త‌దిత‌ర ప్రాంతాల్లో ఇప్పటికే షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్ర యూనిట్… అదే ఉత్సాహాంతో ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మ‌రో షెడ్యూల్ మొద‌ల‌పెట్ట‌బోతున్నారు. ఈ షెడ్యూల్ లో మేజ‌ర్ టాకీ పార్ట్ పూర్తిచేస్తారు.

జీఏ 2 బ్యాన‌ర్ తో గోపీసుంద‌ర్ జ‌ర్నీ గురించి అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో జీఏ2 బ్యాన‌ర్ లో రిలీజైన గీతగోవిందం సినిమాకి గోపీ బ్లాక్ బ‌స్ట‌ర్ సంగీతం ఇచ్చారు. ఈ నేప‌థ్యంతోనే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ కి 6 పాట‌లు రెడీ చేశాడు. ఈ ఆరు పాట‌ల్లో నాలుగు పాట‌లు ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేశారు. అలానే మిగ‌తా రెండు పాటలు ఫారిన్ లో చిత్రీక‌ర‌ణ‌కు ప్లాన్ చేస్తున్న‌ారు.

తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రేండింగ్ అవ్వ‌డం ఈ సినిమాకి మీద ఉన్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. అదే ఊపులో తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

న‌టీ న‌టులు
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను

టెక్నీషియ‌న్స్
డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్