NBK బాలయ్య తో పరశురాం సినిమా ?

Monday,October 31,2022 - 12:02 by Z_CLU

నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ, హీరోగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. ఆ తదుపరి సినిమాకు ప్రశాంత్ వర్మ తో పాటు మరో డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది. తాజాగా దర్శకుడు పరశురాం కూడా బాలయ్య నెక్స్ట్ లిస్టులో చేరిపోయాడు.

అవును తాజాగా బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథ సిద్దం చేస్తున్నాడు పరశురాం. అందులో తన శైలిలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా జతచేశాడట. త్వరలోనే ఆ కథను బాలకృష్ణ కి చెప్పి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకోబోతున్నాడు పరశురాం. అన్ని కుదిరితే గీతా ఆర్ట్స్ బేనర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ కాంబో సినిమా ఎవరూ ఊహించలేదు. కానీ ఈ మేటర్ దర్శకుడు పరశురాం స్వయంగా పబ్లిక్ ఈవెంట్ లో బయటపెట్టాడు. ఇటివల అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా విచ్చేసిన దర్శకుడు పరశురాం ఈవెంట్ లో మాట్లాడుతూ ” బాలయ్య గారు నేను అరవింద్ గారు మీ దగ్గరికి ఓ కథతో రాబోతున్నాం” అంటూ చెప్పుకున్నాడు. దీంతో ఈ కాంబో సినిమా న్యూస్ బయటికొచ్చింది. బహుశా ఈ విషయం బాలయ్య కు కూడా ఇంకా తెలియకపోవచ్చు. ప్రస్తుతం నాగ చైతన్య తో ‘నాగేశ్వరరావు(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నారు పరశురాం. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక బాలయ్య తో సినిమా ఉండొచ్చు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics