నాగ చైతన్యతో బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ?

Monday,May 23,2022 - 05:36 by Z_CLU

‘Bommarillu’ Bhaskar to direct Naga Chaitanya soon ?

‘బొమ్మరిల్లు’ సినిమాతో దర్శకుడిగా బెస్ట్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా టైటిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకున్న భాస్కర్ తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ దర్శకుడు నెక్స్ట్ నాగ చైతన్యతో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘దూత్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఆ తర్వాత పరశురాం డైరెక్షన్ లో ‘నాగ చైతన్య’ సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక చైతు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తుంది.

ఇటివలే బొమ్మరిల్లు భాస్కర్ చైతుకి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీతో ఓ లైన్ చెప్పి సినిమా లాక్ చేసుకున్నాడని తెలుస్తుంది. పూర్తి స్క్రిప్ట్ అవ్వగానే ఫైనల్ నెరేషన్ ఇచ్చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నాడని సమాచారం. ఈ కాంబో సినిమాను 14రీల్స్ ప్లస్ బేనర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మిస్తారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మిగతా డీటెయిల్స్ తెలియనున్నాయి.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics