Allu Aravind Reveals the secret behind Geetha Arts
టాలీవుడ్ బిగ్ బ్యానర్స్ లో ఒకటి గీతాఆర్ట్స్. మరి ఆ బ్యానర్ కు ఆ పేరు ఎలా వచ్చింది? గీత అంటే ఎవరు? అల్లు అరవింద్ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత అనే రూమర్ ఉంది, అది నిజమేనా? ఇదే మాట అంటే అల్లు అరవింద్ ఏమంటారు?
గీతాఆర్ట్స్ కు ఆ పేరు పెట్టడం వెనక జరిగిన తతంగాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బయటపెట్టారు. తన గర్ల్ ఫ్రెండ్ కు, బ్యానర్ పేరుకు సంబంధం లేదంటున్నారాయన.
– గీతా ఆర్ట్స్ అనే పేరు పెట్టింది మా నాన్నగారు అల్లు రామలింగయ్య గారు. ఆ పేరు ప్రపోజ్ చేసింది నాన్నగారు. భగవద్గీత సారాంశం ఒక్కటే. ప్రయత్నం మాత్రం మనది, రిజల్ట్ మన చేతిలో లేదు. నిర్మాతగా మన ప్రయత్నం మనం చేస్తాం, రిజల్ట్ మాత్రం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంది. అలా సినీ రంగం అనేది గీతకు దగ్గరగా ఉంది కాబట్టి, గీతాఆర్ట్స్ అనే పేరు పెట్టారు నాన్న.
– నాకు గీత అనే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. దీనికి, మా నాన్నగారు గీతాఆర్ట్స్ అనే పేరుపెట్టడానికి సంబంధం లేదు. ఈ రెండూ వేర్వేరు సందర్భాలు. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఈ రెండూ కలిపేసి మాట్లాడుతుంటారు. పెళ్లయిన తర్వాత నా భార్య పేరిట నిర్మలా ఆర్ట్స్ అని పెట్టొచ్చు కదా అని అంటారు చాలామంది. కానీ అప్పటికే గీతాఆర్ట్స్ సక్సెస్ అయింది. ఇక ఆ పేరు మార్చడం ఎందుకని అలా వదిలేశాం. (నవ్వులు)
