చిరు సినిమాలో 'కలెక్షన్ కింగ్' రోల్ ఏంటి ?

Sunday,February 09,2020 - 03:20 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటివలే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబును ఓ రోల్ కోసం తీసుకొనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ నుండి ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ చిరుతో మోహన్ బాబు కలిసి నటించడం పక్కా అనే టాక్ వినిపిస్తుంది.

సినిమాలో మోహన్ బాబు ఎలాంటి రోల్ లో కనిపిస్తాడనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. కొరటాల సినిమాలో హీరోతో పాటు మిగతా నటీ నటులందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన తీసిన సినిమాలు చూస్తే ఈ విషయం క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇక లెజండరీ నటులకయితే ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తూ క్యారెక్టర్ డిజైన్ చేస్తాడు కొరటాల. అదే ఇప్పుడు మోహన్ బాబు రోల్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంది.

దేవాలయాల పరిరక్షణ అనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతుందని, ఇందులో చిరు డబుల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మోహన్ బాబును దర్శకుడు శివ ఏదైనా నెగిటీవ్ రోల్ లో ప్రెజెంట్ చేస్తాడా లేదా చిరుకి సహాయపడే ఏదైనా మంచి పాత్రలో చూపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.