మెగా స్టార్ అదే టైటిల్ తో

Sunday,February 09,2020 - 02:22 by Z_CLU

ఈ మధ్య స్టార్ హీరోల సినిమా అనౌన్స్ మెంట్ నుంచే కొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్ గా మెగా స్టార్ , కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్ పెట్టబోతున్నారనే వార్త హంగామా చేసింది. సినిమాకు ఆ టైటిలే పర్ఫెక్ట్ అనేంతలా దాన్ని ఫ్యాన్స్ పాపులర్ చేసారు.

అయితే ఎట్టకేలకు అదే టైటిల్ ను సినిమాకు పెట్టబోతున్నారట మేకర్స్. కాకపోతే అందులో నుండి ‘గోవింద’ను తొలగించి కేవలం ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారని తెలుస్తుంది. లేటెస్ట్ గా సినిమా నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ టైటిల్ ను రిజస్టర్ చేయించారు. అంటే ఆల్మోస్ట్ మేకర్స్ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారనేది కన్ఫర్మ్ అయినట్టే. ఇక అనౌన్స్ ఒక్కటే బ్యాలెన్స్. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ టైటిల్ ను ఖరారు చేసి మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారేమో చూడాలి.