ఫ్రైడే రిలీజ్

Wednesday,May 17,2017 - 02:45 by Z_CLU

ఎగ్జైటెడ్ సినిమాలతో రెడీ అయిపోయింది ఫ్రైడే బాక్సాఫీస్. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలతో బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ తో రెడీ అయిపొయింది ఈ ఫ్రైడే.

కేశవ : నిఖిల్, రీతూవర్మ జంటగా తెరకెక్కిన అల్టిమేట్ రివేంజ్ థ్రిల్లర్ కేశవ. ఇప్పటికే టీజర్స్, ట్రేలర్ తో ఎట్రాక్ట్ చేసిన కేశవ ఈ ఫ్రై డే గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సన్నీ M.R. మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కింది. అభిషేక్ నామా ప్రొడ్యూసర్.  నిఖిల్ కెరీర్ లోనే అత్యథిక థియేటర్లలో విడుదలవుతోంది కేశవ. రివెంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నిడివి కేవలం గంట 50నిమిషాలు మాత్రమే.

మిక్చర్ పొట్లం : జయంత్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మిక్చర్ పొట్లం. సతీష్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మాధవపెద్ది సురేష్, చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సినిమా కూడా ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది.

కల్పన 3 : ఉపేంద్ర, ప్రియమణి, తులసి నటించిన అల్టిమేట్ హారర్ థ్రిల్లర్ కల్పన-3. అర్జున్ జన్య మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా R. ఉదయ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. భీమవరం టాకీస్ బ్యానర్ పై తెలుగులో విడుదలకానుంది. ఉపేంద్ర, ప్రియమణి మేజిక్ కచ్చితంగా పనిచేస్తుందని అంటున్నారు మేకర్స్.

ఈ వీకెండ్ కోలీవుడ్ లో కూడా సందడి బాగానే ఉంది. జయం రవి, సాయేషా సైగల్ జంటగా నటించిన సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ ‘వనమాగం’ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జీవ, శ్రీదివ్య నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘సంగిలి బంగిలి కథవ’… దినేష్ రవి, రాజేంద్రన్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఉల్ కుత్తు’ కూడా ఈ ఫ్రై డే బాక్సాఫీస్ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇక హిందీలో ఇప్పటికే దేనికదే హై ఎండ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ హిందీ మీడియం కూడా ఈ ఫ్రై డే రిలీజ్ అవుతున్నాయి. అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన  ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కాగా, ఇర్ఫాన్ ఖాన్, సబా ఖమర్ నటించిన ‘హిందీ మీడియం’ బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ట్రెండింగ్ సోషల్ మెసేజ్ తో రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కి కావలసినంత క్రేజ్ ని ఆల్ రెడీ క్రియేట్ చేసుకున్నాయి.