ఇకపై భయపడేది లేదంటున్న బన్నీ బ్యూటీ

Thursday,June 29,2017 - 06:03 by Z_CLU

DJ సక్సెస్ తో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసిన పూజా హెగ్డే చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తూ పని చేయడమే పర్సనల్ ఎజెండా అని చెప్పుకునే పూజా, ఈ నెల 30 న అబూదాబి కి ప్రయాణమవుతుంది. ఓ వారం రోజులు అక్కడే టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయిన పూజా, ఫస్ట్ టైమ్ ఒక అడ్వెంచర్ చేయబోతుందట.

బేసిగ్గా హైట్స్ అంటే హైరానా పడిపోయే పూజా, ఇప్పటివరకు స్కై డైవింగ్ లాంటి వాటి జోలికి కూడా వెళ్ళలేదట. అలాంటిది ఈ సారి ఎలాగైనా స్కై డైవింగ్ చేయాల్సిందే అని డిసైడ్ అయిపోయింది DJ హీరోయిన్. భయపడినంత కాలం భయం మనల్ని భయపెట్టడం మానదు అనే స్టేట్ మెంట్ ని స్ట్రాంగ్ గా నమ్మే పూజా, ఈ సారి స్కై డైవింగ్ చేసి, ఆ ఒక్క భయానికి కూడా చరమగీతం పాడేద్దామని డిసైడ్ అయింది.