నారా రోహిత్ చేపల పులుసు కథ

Thursday,June 29,2017 - 05:06 by Z_CLU

విలక్షణ సినిమాలు చేయడమే కాదు, భోజనం విషయంలో కూడా తన స్పెషల్ టాలెంట్ చూపిస్తున్నాడు నారా రోహిత్. స్వతహాగా ఈ హీరో మంచి భోజన ప్రియుడు.మరీ ముఖ్యంగా బిర్యానీ, నాన్-వెజ్ వంటకాలు దొరికితే అస్సలు వదలడు. ప్రతి రోజూ తనకు బిర్యానీ ఉండాల్సిందేనంటూ గతంలో ఓసారి నారా రోహిత్ ప్రకటించేశాడు కూడా. అలాంటి హీరో ఇప్పుడు ఏకంగా వంటవాడిగా మారాడు. అది కూడా తనకిష్టమైన చేపల కూర కోసం.

 

అవును.. ఏకంగా సినిమా సెట్స్ లోనే నారా రోహిత్ చేపల కూర వండేశాడు. ప్రస్తుతం శమంతకమణి సినిమా చేస్తున్నాడు నారా రోహిత్. ఇందులో పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. అదే గెటప్ తో గరిట తిప్పేశాడు. యూనిట్ లో ప్రముఖుల కోసం స్వయంగా తనే చేపల కూర వండాడు. ఆ స్టిల్స్ ను శమంతకమణి యూనిట్ రిలీజ్ చేసింది.