కలర్ ఫుల్ ‘మన్మధుడు’

Friday,June 07,2019 - 01:03 by Z_CLU

టాలీవుడ్ లో ‘మన్మధుడు’ ఒకడే… స్పెషల్ గా పేరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ‘మన్మధుడు 2’ సినిమాలో కూడా హీరో కూడా ఒక్కడే. కానీ హీరోయిన్సే రోజు రోజుకి పెరిగిపోతున్నారు. సినిమా లాంచ్ రోజు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అని చిన్నగా అనౌన్స్ చేసినా, అక్కడి నుండి ఒక్కొక్కరిగా స్ట్రేట్ గా సెట్స్ నుండే రివీల్ చేస్తున్నారు మేకర్స్.

సినిమాలో సమంతా ఓ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ విషయం రివీల్ అయిన రోజు, మామ కోడళ్ళను మరోసారి స్క్రీన్ పై చూసుకోవచ్చు అనుకున్నారంతా. అంతటితో ఆగిందా… బాలీవుడ్ హీరోయిన్ ‘అక్షరగౌడ’  సినిమాలో కామియో రోల్ లో నటిస్తుంది అని పోర్చుగీస్ షెడ్యూల్ లో రివీల్ చేశారు… ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ పేరు వినీ వినగానే ఎవరీ ‘అక్షరగౌడ’ అని గూగుల్ చేసుకుని మరీ మురిసిపోయారు ఫ్యాన్స్. అంతటితో ఆగిందా..?

ఇప్పుడు సినిమాలో కీర్తి సురేష్ కూడా ఉందంటూ కన్ఫమ్ చేశారు మేకర్స్. ఎగ్జైటెడ్ న్యూసే… కానీ ఫ్యాన్స్ రియాక్షనే డిఫెరెంట్ గా ఉంది… ఈ సినిమాలో ఇలాంటి కలర్ ఫుల్ సర్ ప్రైజెస్ ఇంకా ఎన్ని ఉండబోతున్నాయో అనే యాంగిల్ లో సోషల్ మీడియాలో డిస్కషన్స్ బిగిన్ అయ్యాయి..

నిజంగానే ఈ హీరోయిన్స్ వరస కీర్తి సురేష్ తో ఆగనుందా…? లేకపోతే ఇప్పటి వరకు చేసినట్టు సెట్స్ పైకి వచ్చాకే రివీల్ చేద్దామనే ప్లానింగ్ లో ఉన్నారా..?… చూడాలి మరీ. ఏది ఏమైనా అసలే పాజిటివ్ బజ్ మధ్య తెరకెక్కుతున్న ‘మన్మధుడు 2’ రోజురోజుకి మరింత కలర్ ఫుల్ గా మారుతుంది.