'గుణ 369' గా వస్తున్న యంగ్ హీరో
Friday,April 26,2019 - 02:52 by Z_CLU
‘ఆర్ ఎక్స్ 100 ‘ ఫేమ్ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న కొత్త సినిమాకు `గుణ 369` అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. కార్తికేయ స్టిల్ తో ఓ పోస్టర్ రెడీ చేసి ఈ టైటిల్ ని రిలీజ్ చేసారు. కార్తికేయ బాడీని హైలైట్ చేస్తూ బ్యాక్ సైడ్ వ్యూ తో పోస్టర్ ను వదిలారు. అయితే గుణ టైటిల్ పక్కన 369 అనే నంబర్ ఎందుకు పెట్టారనేది క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది. ఆ నంబర్ పెట్టడానికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉందని, అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు మేకర్స్.

ఇటివలే ఒంగోలులో ఓ భారీ షెడ్యుల్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా క్రొయేషియాలో 2 సాంగ్స్ షూట్ జరుపుకుంది. ఈ నెల 29 నుంచి మే 15 వరకు హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యుల్ తో ఓ సాంగ్ మినహా టోటల్ షూటింగ్ పూర్తి కానుంది.
రియల్ లవ్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బోయపాటి శిష్యుడు అర్జున్ జంద్యాల డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్నారు.