‘మన్మధుడు’ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ అనిపించుకుంటుందా..?

Friday,June 14,2019 - 12:02 by Z_CLU

‘మన్మధుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమా చుట్టూ చాలా క్యూరియాసిటీ క్రియేట్ అయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి ఈ టైటిల్ నే ఫిక్స్ చేయడం వెనక ఫ్యాన్స్ లో పెద్ద డిస్కషనే జరిగింది. కానీ నిన్న రిలీజైన టీజర్ చూస్తే ఈ సినిమాకి ‘మన్మధుడు’ తప్ప ఇంకో టైటిల్ ఆప్షనే లేదనిపించింది.

ఈ మధ్య కాలంలో నాగార్జున రొమాంటిక్ ఎసెన్స్ ఉన్న సినిమాల్లో నటించింది తక్కువే. ‘ఊపిరి’ నుండి రీసెంట్ గా రిలీజైన ‘దేవదాసు’ వరకు అన్నీ డిఫెరెంట్ సినిమాలే. ఎందులోనూ నాగార్జునను రొమాంటిక్ గా ప్రెజెంట్ చేసే అవకాశం దొరకలేదు. ఈ టైమ్ లో ఖచ్చితంగా నాగార్జునను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కథనే సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో రిలీజైన ‘మన్మధుడు’ కి, ఈ ‘మన్మధుడు2’ కి చాలా డిఫెరెన్స్ ఉంది. ఈ ‘మన్మధుడు 2’ కంప్లీట్ గా న్యూ ఏజ్ డ్రామా… ఎక్కడా ఇది పాత ‘మన్మధుడు’ ను గుర్తుచేయదు. అది మాత్రం పక్కా..

ఇక ఈ ‘మన్మధుడు 2’ ముందు ఉన్న చాలెంజ్ ఏంటంటే టీజర్ లాగే సినిమా కూడా అదే స్థాయిలో ఇంప్రెస్ చేయాలి. దర్శకుడిలో కంటెంట్ లేకపోతే నాగ్ అంత ఈజీగా అవకాశం ఇవ్వడు. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఫ్యాన్స్ లో ఉంది. ఇక ఇది సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ అనిపించుకుంటుందా లేదా..? సినిమా రిలీజైతే కానీ తేలదు.