రిపీట్ కానున్న మన్మధుడి మ్యాజిక్

Monday,March 25,2019 - 02:31 by Z_CLU

ఏప్రియల్ నుండి మన్మధుడి మ్యాజిక్ బిగిన్ కానుంది. హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. నాగార్జున ఇష్టపడి చేస్తున్న సినిమా ఇది. ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్న సినిమా మన్మధుడు 2. జస్ట్ ఒక్క సినిమాతో రాహుల్ రవీంద్రన్ నాగ్ దృష్టిలో పడటం, ఇదే కరెక్ట్ టైమనుకొని అప్పటి వరకు మనసులో పెట్టుకున్న లైన్ ని, నాగ్ కి న్యారేట్ చేయడం, ఆయన కనీసం చిన్న సందేహం కూడా లేకుండా యస్ అనేయడం… ఇది ‘మన్మధుడు 2’ అఫీషియల్ గా కన్ఫమ్ కాకముందు జరిగిన ప్రాసెస్.

కథలో దమ్ముండాలి కానీ ఎంత క్లాసిక్ టైటిల్ అయినా వాడేయడానికి పెద్దగా ఆలోచించడు నాగ్. గతంలో ‘దేవదాస్’ సినిమాకి కూడా అదే జరిగింది. టైటిల్ అనౌన్స్ చేసి చేయగానే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో సెట్ అయ్యాయి. సినిమా రిలీజ్ కి ముందే అ టైటిల్ కి, సినిమా కథకి ఉన్న కనెక్షన్ ని అంతే పద్దతిగా కన్విన్స్ చేసిన నాగార్జున, సినిమా రిలీజ్ తర్వాత ఆ అంచనాలను ఈజీగా నానితో కలిసి అందుకోగలిగాడు.

అయితే ఈ సారి కూడా అంతే కాన్ఫిడెంట్ గా ‘మన్మధుడు 2’ ని టైటిల్ గా ఫిక్స్ చేసుకున్నాడు నాగ్. దాంతో కనీసం సినిమా ఎలా ఉండబోతుందో అనే క్వశ్చన్ కూడా లేకుండా, 2002 లో రిపీట్ అయిన రొమాంటిక్ సీజన్ ని మరోసారి క్రియేట్ కానుందని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్.

అప్పట్లో మన్మధుడికి జోడీగా సోనాలి బింద్రే నటిస్తే, ఈ సారి అంతే ప్రీషియస్ స్పేస్ ని రకుల్ ప్రీత్ షేర్ చేసుకోనుంది. కరియర్ లోనే ఫస్ట్ టైమ్ నాగార్జున హీరోయిన్ గా కనిపించనుంది. కథ చెప్పి నాగ్ నే కన్విన్స్ చేసుకోగలిగిన రాహుల్, అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఏ మాత్రం తగ్గడు అనే టాక్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది.

RX 100 లాంటి సెన్సేషనల్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు.