'నంది' విన్నర్ తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Wednesday,March 01,2017 - 07:58 by Z_CLU

వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ 2013 సంవత్సరంకి గాను కాంస్య నంది అవార్డుకి ఎంపికయ్యారు.. ఈ సందర్భంగా ‘రాజ్ తరుణ్’ తో జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

మీ మొదటి సినిమాకి గాను కాంస్య నంది అవార్డు వచ్చినందుకు ఎలా ఫీలవుతున్నారు ?

నాకు కూడా ఈ న్యూస్ ఇప్పుడే తెలిసిందే.. వరుసగా కాల్స్ వస్తున్నాయి. అందరు విష్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆక్చువల్ గా నాకంటే సినిమాకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది . ఇక సినిమా సక్సెస్ అనేది అన్నిటికన్నా సంతోషాన్ని ఇస్తుంది… ఈ అవార్డ్స్ అనేవి ఎక్స్ట్రా బోనస్ లా ఫీలవుతా. నిజానికి ‘ఉయ్యాలా జంపాల’ విషయం లో నాగార్జున గారికి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఆయన సినిమాకి ఇచ్చిన సపోర్ట్ ప్రమోట్ చేసిన విధానం ఎప్పటికి మర్చిపోలేను. ఇక నన్ను నమ్మి నాతో ఆ సినిమాను తెరకెక్కించిన నిర్మాత రామ్ మోహన్ రావు గారికి డైరెక్టర్ విరించి వర్మ కి ఈ సందర్భంగా మరోసారి థాంక్స్ చెప్పుకుంటున్నా.

‘కిట్టు’ క్యారెక్టర్ తో ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు ?

నిజానికి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్.. డబ్బుల కోసం కుక్కల్ని కిడ్నాప్ చేసే కిట్టు క్యారెక్టర్ సినిమా అంతా నవ్విస్తుంది.. ఇప్పటి వరకూ వినని చూడని క్యారెక్టర్ వినగానే స్ట్రైకింగ్ గా అనిపించింది… రేపు రిలీజ్ తర్వాత థియేటర్స్ లో అందరు బాగా ఎంజాయ్ చేస్తారు…

ప్రతీ సినిమాకి ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేస్తున్నట్టున్నారు..?

అంటే కావాలని ప్లాన్ చేసుకోవట్లేదు. అలా కలిసొస్తున్నాయంతే…నాకు వచ్చిన కథల్లో ఏది బాగా నచ్చితే అది చేసేస్తూ కంటిన్యూ చేస్తున్నా.. ప్రతీ సినిమాకు అలా కుదురుతుంది. అంతే కానీ స్పెషల్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనీ మాత్రం అనుకోను…

ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ లోనే వరుసగా సినిమాలు చేస్తున్నారు? రీజన్ ఏంటి?

స్పెషల్ గా రీజన్ అంటూ ఏం లేదు. ‘ఈడో రకం ఆడో రకం’ సినిమా చేస్తున్నప్పుడే ఈ స్క్రిప్ట్ విన్నాను.. బాగా నచ్చింది చేసేశా.. ఇప్పుడు ‘రాజు గాడు’ అనే సినిమా కూడా చేస్తున్నా..త్వరలో మరో సినిమా కూడా చేయబోతున్నా.. అనిల్ గారితో అలా కుదిరేసింది. నిజానికి ఆయన చాలా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్.. కథ నచ్చితే ఖర్చు కి ఏ మాత్రం వెనకాడకుండా ఖర్చు పెడతారు.. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది….

ఈ మధ్య వచ్చిన ఓ రూమర్ కి రియాక్ట్ అయ్యారు ? రియాక్ట్ అవ్వడానికి రీజన్ ?

హీరోగా ఏవో రూమర్స్ వస్తుంటాయి అనుకున్నా కానీ మరీ ఇలా వస్తాయనుకోలేదు.. జెనరల్ గా రూమర్స్ కి అస్సలు రియాక్ట్ అవ్వను.. కానీ రీసెంట్ గా ఓ యాంకర్ మీద వచ్చిన రూమర్ కి మాత్రం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.. చాలా మంది కాల్స్ చేసి మెస్సేజ్ చేసి అడుగుతుంటే విసుగొచ్చి అదేమీ లేదు రా బాబు అని రియాక్ట్ అయ్యానంతే… ఇక అలాంటి న్యూస్ లు చదవడం, పట్టించుకోవడం మానేశా.

 

ఈ సినిమాలో మీతో నటించిన అను ఇమ్మానుయేల్ గురించి ?

అను చాలా మంచి యాక్టర్. నిజానికి కళ్ళతో నటించే నటి అని చెప్పాలి. ఏ సీన్ అయినా కళ్ళతో నటించేసేది..తనతో చాలా ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్లీ గా యాక్ట్ చేశా… ఫీచర్లో హీరోయిన్ గా మంచి పొజిషన్ కి వెళ్తుందని నా నమ్మకం….

ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్ర అందించిన డైలాగ్స్ గురించి ?

నిజానికి ఆయన మా సినిమాకి రాస్తున్నారంటే ముందు నమ్మలేదు.ప్రెజెంట్ ఆయన చాలా సినిమాలకి రాస్తున్నారు గా అనుకున్నాను. అయితే ఆయన కలిసి ఈ సినిమా చేస్తారా అని వెళ్లి అదిగగానే ఉప్పుకొని ఈ సినిమా కోసం అద్భుతమైన డైలాగ్స్ రాయడం జరిగింది. ముఖ్యంగా ఫన్నీ డైలాగ్స్ చాలా బాగా రాశారు.. ఈ సినిమాకు ఆయన డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి…

అంధగాడు సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు? ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు?

జాగ్రత్తలేం తీసుకోలేదు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేశా అంతే. ఆ సినిమా విషయంలో ఒకటి చెప్పాలి ఈమధ్య నేను విన్న స్క్రిప్ట్స్ లో ది బెస్ట్ స్క్రిప్ట్ అది. కథ బాగా నచ్చడం, పైగా  అంధుడి పాత్ర అనగానే వెంటనే ఓకే అనేశా.. అంధుడి పాత్ర అనగానే అదేదో ఆర్ట్ ఫిలిం అనుకుంటారు కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. 2 సాంగ్స్ మినహా షూటింగ్ అయిపోయింది చాలా బాగా వచ్చింది.

సినిమా రిలీజ్ కి ముందు చాలా టెన్షన్ ఫీలవుతారట నిజమేనా?

అది నిజమే రిలీజ్ కి ఒక రోజు ముందు చాలా టెన్షన్ గా ఫీలవుతా..అలా అలవాటై పోయింది.. వీలైనంత వరకూ మొబైల్ ఫ్లయిట్ మోడ్ లేదా స్విచ్ ఆఫ్ చేసేస్తా.. రిలీజ్ తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిపోయి ఇక ఆ సినిమా నుంచి బయటికొచ్చేసి ఆ సినిమా గురించి ఆలోచించడం మానేసి నెక్స్ట్ సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తుంటా..

 

‘శతమానం భవతి’ సినిమా వదులుకోవడానికి రీజన్ ఏంటి?

నిజానికి ఆ కథ నాకు బాగా నచ్చింది. కానీ సంక్రాంతి కి ఎలాగైనా రిలీజ్ అవ్వాలని రాజు గారు చెప్పారు. అప్పుడు నా డేట్స్ కుదరని కారణంగానే ఆ సినిమా వదులుకున్నాను. నిజానికి శర్వా నాకన్నా బాగా చేసాడని ఫీలవుతున్నా. అంతే కానీ మిగతా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. త్వరలోనే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నా..

నెక్స్ట్ చేయబోయే సినిమాలేంటి?

‘అంధగాడు’ రిలీజ్ కి రెడీగా ఉంది. అన్నపూర్ణ బ్యానర్ లో రంజని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నా, ఈ సినిమా తర్వాత సంజన అనే మరో డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో కూడా ఓ సినిమా చేస్తున్నా…ఆల్మోస్ట్ అక్టోబర్ వరకూ ఈ సినిమాలతో ఫుల్ బిజీ… ఈ సినిమాల తర్వాత రైటర్ ప్రసన్న తో కూడా ఓ సినిమా చేయబోతున్నా…