జీ సినిమాలు ( మార్చి 2nd )

Wednesday,March 01,2017 - 10:09 by Z_CLU

నటీ నటులు: బేబీ షామిలీ, నిగళ్ గల్ రవి, కనక

ఇతర నటీనటులు : సత్యప్రియ, శ్రీలక్ష్మి, చంద్ర శేఖర్, కిట్టు, సెంథిల్ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ గణేష్

డైరెక్టర్ : రామ నారాయణ

ప్రొడ్యూసర్స్ : A.మోహన్, C.M. కృష్ణ

బేబీ షామిలి అంటే ఆ రోజుల్లో చాలా క్రేజ్ ఉండేది. అందుకే కొన్ని కథలు కూడా తనకోసమే ప్రత్యేకంగా ప్లాన్ చేసి మరీ తెరకెక్కించారు దర్శకులు. లక్ష్మీదుర్గ లో బేబీ షామిలి డ్యూయల్ రోల్ లో అలరిస్తుంది. దానికి తోడు కుక్క, కోతి నటన కూడా చిన్నపిల్లల్ని ఆకట్టుకునేలా తెరకెక్కించాదు డైరెక్టర్ రామ నారాయణ.

==============================================================================

నటీనటులు : చిరంజీవి, విజయశాంతి, నళిని

ఇతర నటీనటులు : శివకృష్ణ, గుమ్మడి, నూతన్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, కాకరాల, రావి కొండల రావు, సరళ, సూర్యకాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : K. మురళీ మోహన రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : డిసెంబర్ 29, 2013

స్మగ్లింగ్ చేస్తూ పెడదారిన పట్టిన తండ్రిని సరైన దారిలో పెట్టడం కోసం ఒక కొడుకు పడ్డ ఘర్షనే ఈ సంఘర్షణ. 1983 లో రామా నాయుడు గారి పుట్టిన రోజున జూన్ 6 న సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా అదే సంవత్సరం డిసెంబర్ 29 న రిలీజైంది. ఇమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి పెద్ద ఎసెట్.

==============================================================================

 

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ

ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : రాఘవేంద్ర రావు

నిర్మాత : కృష్ణమోహన రావు

రిలీజ్ డేట్ : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ పాండు రంగడుసినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు. 

==============================================================================

నటీనటులు : ఉదయ్ కిరణ్, శ్రీహరి, నేహ జుల్క

ఇతర నటీనటులు : వేణు మాధవ్, సాయాజీ షిండే, కౌసల్య, జయప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలంగాణ శకుంతల తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : E. సత్తిబాబు

ప్రొడ్యూసర్ : L. శ్రీధర్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2007

లవర్ బాయ్ ఉదయ్ కిరణ్, రియల్ స్టార్ శ్రీహరి నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వియ్యాల వారి కయ్యాలు’. ఫ్యాక్షనిస్టుల మధ్య ఓ ప్రేమ జంట తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేశారు అన్నదీ ఈ సినిమా ప్రధాన కథాంశం. రమణ గోగుల మ్యూజిక్ ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

నటీనటులు : అల్లరి నరేష్, మంజరి

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, జయ ప్రకాష్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణ రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్లా విజయ ప్రసాద్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2008

 అల్లరి నరేష్, మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా పర్ ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. ప్రాణం కన్నా ప్రేమే గొప్పది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

============================================================================= 

నటీ నటులు : ప్రభాస్, కంగనా రనౌత్

ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్

రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. ఓ వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ ల మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

=============================================================================

నటీనటులు : కమల్ హాసన్, మాధవన్, త్రిష, సంగీత

ఇతర నటీనటులు : రమేష్ అరవింద్, ఊర్వశి, ఉషా ఊతప్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్  : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : సుబ్రహ్మణ్యం B, రూపేష్ Y

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2010

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి, కామెడీ సినిమాలకి విభిన్నంగా తెరకెక్కిన కమర్షియల్ హిల్లెరియాస్ ఎంటర్ టైనర్ మన్మధ బాణం. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అంబుజాక్షి కి, మదన్ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి నిర్ణయిస్తారు పెద్దలు. కోటీశ్వరుడైన మదన్ అంబుజా అంటే ఇష్టమే కానీ, ఎక్కడో అంబుజా కి సీక్రెట్ లవర్ ఉన్నాడనే అనుమానం త్లిచివేస్తూ ఉంటుంది. అప్పుడు మదన్ ఆ విషయం తేల్చుకోవడానికి ఓ డిటెక్టివ్ ని పెడతాడు. ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ ని కమల్ హాసన్ పోషించాడు. అంబుజా , మదన్ లుగా, త్రిష, మాధవన్ నటించారు.  అసలు కథ ఏ మలుపులు తిరిగింది..? చివరికి ఏం జరిగిందనేది ZEE Cinemalu లో చూడాల్సిందే…